Wednesday, April 30, 2025
Homeజాతీయం‘జ‌మిలి’పై పార్లమెంటరీ కమిటీ కీల‌క నిర్ణ‌యం

‘జ‌మిలి’పై పార్లమెంటరీ కమిటీ కీల‌క నిర్ణ‌యం

‘జ‌మిలి’పై పార్లమెంటరీ కమిటీ కీల‌క నిర్ణ‌యం

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: జమిలి ఎన్నిక‌ల‌పై పార్ల‌మెంట‌రీ జాయింట్ క‌మిటీ ఏప్రీల్ 22నుంచి స‌మావేశాలు నిర్వ‌హించ‌నుంది. దేశ‌వ్యాప్తంగా ప‌ర్య‌టించి ప‌లు రాష్ట్రాల అభిప్రాయాల‌ను తెలుసుకోనుంది. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లోని రాజ‌కీయ పార్టీల‌ను, మేథావుల‌ను క‌లిసి స‌మ‌లోచ‌న చేయ‌నుంది. అందుకు అనుగుణంగా పీపీ చౌద‌రి అధ్వ‌ర్యంలోని జేపీసీ స‌న్నాహాలు మొద‌లుపెట్టింది. ఇందులో భాగంగా మొద‌ట‌గా మ‌హారాష్ట్రలో ప‌ర్య‌టించ‌నుంది క‌మిటీ. ఆ త‌ర్వాత మేలో ఉత్త‌రాఖండ్‌, జూన్‌లో జ‌మ్మూకశ్మీర్, ఛ‌త్తీస్‌గ‌డ్‌, పంజాబ్, హ‌ర్యానా త‌దిత‌ర రాష్ట్రాల‌తో పాటు దేశంలోని అన్ని ప్రాంతాలను ఆయా షెడ్యూల్ కు అనుగుణంగా జీపీసీ నేత‌ల అభిప్రాయాల‌ను తెలుసుకోనుంది. అంతేకాకుండా మేథావులు, పౌరులు, పౌర హ‌క్కుల సంఘాల నుంచి కూడా జేపీసీ అభిప్రాయాల‌ను సేక‌రించ‌నుంది. అందుకు అనుగుణంగా..జ‌మిలి ఎన్నిక‌ల‌పై సంబంధించి ప్ర‌త్యేక వెబ్ సైట్ రూపొందించి.. అన్ని భాషలలో అందుబాటులోకి తేనుంది…అదే విధంగా QR కోడ్ సౌకర్యంతో వెబ్‌సైట్ త్వరలో ప్రారంభించబడుతుంద‌ని పీపీ చౌద‌రి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img