- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసింది. ఏప్రీల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో 26మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ పాశవిక దాడిని అసెంబ్లీ సభ్యులు ముక్తకంఠంతో ఖండించారు. అసెంబ్లీ వేదికగా బాధిత కుటుంబసభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీల సభ్యులు హాజరయ్యారు. జమ్మూ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, ఈ తరహా దాడులు జరగకుండా..కేంద్ర ప్రభుత్వం అమలు పరించే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని సభా సాక్షిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.