Monday, May 12, 2025
Homeజాతీయంజ‌మ్మూలో రాత్రి ఎలాంటి కాల్పులు జ‌ర‌గ‌లేదు: ఆర్మీ అధికారులు

జ‌మ్మూలో రాత్రి ఎలాంటి కాల్పులు జ‌ర‌గ‌లేదు: ఆర్మీ అధికారులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పాక్-భార‌త్ దేశాల మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ‌ నేపథ్యంలో దేశంలోని స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో జ‌మ్మూలో రాత్రి ఎలాంటి కాల్పులు జ‌ర‌గ‌లేద‌ని ఆర్మీ అధికారులు తెలిపారు. అదేవిధంగా పంజాబ్, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో కూడా శాంతియుత‌ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌జ‌లు త‌మ కార్యక‌లాపాల‌ను య‌థావిధిగా నిర్వ‌హిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లోని ముఖ్య‌మైన వాణిజ్య ప్రాంతాలు జ‌నాల‌తో కిట‌కిట‌లాడాయి. మ‌రోవైపు వ్యూహాత్మ‌క ప్రాంతాలైన అమృత్ స‌ర్, బార్మూర్, జైస‌ల్మీర్ త‌దిత‌ర ప్రాంతాల్లో నిఘా పెంచామ‌ని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో రాక‌పోక‌లు మొద‌లైయ్యాయ‌ని అధికారులు తెలిపారు. ఏప్రీల్ 7 ఆప‌రేష‌న్ సింధూర్ పేరుతో పాక్‌లోని ఉగ్ర శిబిరాల‌పై భార‌త్ ఆర్మీ దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో వంద‌ల సంఖ్య‌లో ఉగ్ర‌వాదులు హ‌తమ‌య్యార‌ని అధికారులు వెల్ల‌డించారు. నాలుగు రోజుల‌పాటు ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త వాతావర‌ణానికి చెక్ పెడుతూ..కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి భార‌త్-పాక్ అంగీక‌రించిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -