నవతెలంగాణ-హైదరాబాద్: జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఈ ఘటన మెంధార్‌లోని ఘని ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది. ఉదయం 9:20 గంటల ప్రాంతంలో బస్సు ఘని గ్రామం నుంచి మెంధార్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ వంపు వద్ద డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. సుమారు 42 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన మెంధార్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం రాజౌరికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
జమ్మూలో రోడ్డు ప్రమాదం..లోయలో పడ్డ బస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES