Tuesday, April 29, 2025
Homeజాతీయంజ‌మ్మూలో సెర్చ్ ఆప‌రేష‌న్ ముమ్మ‌రం..ఓ ముఠాను ప‌ట్టుకున్న జ‌వాన్లు

జ‌మ్మూలో సెర్చ్ ఆప‌రేష‌న్ ముమ్మ‌రం..ఓ ముఠాను ప‌ట్టుకున్న జ‌వాన్లు


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడితో అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర ప్ర‌భుత్వం..జ‌మ్మూలో ఉగ్ర‌వాదుల ఏరివేత‌కు సెర్చ్ ఆప‌రేష‌న్ ముమ్మ‌రం చేసింది. ఎక్క‌డిక‌క్క‌డ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌నిఖీలు చేప‌ట్టాయి. ప్ర‌తి ప్రాంతాన్ని జ‌ల్లెడ ప‌డుతూ..స్థానికంగా మ‌కాం వేసిన ఉగ్ర‌వాదుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈక్ర‌మంలో తీవ్ర‌వాద చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న ఓ ముఠాను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అదుపులోకి తీసుకున్నాయి. పాక్ కేంద్రంగా భార‌త్‌లో ఉగ్ర కార్యక‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌..హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్-ఎ-తోయిబా (ఎల్‌ఇటి), జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) సంస్థ‌ల‌కు చెందిన వారిని అధికారులు తెలిపారు. భార‌త్‌లో ఈ సంస్థ‌లు నిషేధించి బ‌డ్డాయి. ముగ్గురు వ్య‌క్తుల‌కు హిజ్బుల్ ముజాహిదీన్, ఎనిమిది మంది ఎల్‌ఇటి, మ‌రో ముగ్గురు జెఎం ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు చెందిన వార‌ని ఆర్మీ అధికారులు తెలిపారు. సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి తీవ్ర‌వాద కార్యకాలాపాల్లో పాల్గొంటున్నార‌ని, తాజాగా భార‌త్‌లో మ‌రో కుట్ర‌ల‌కు ప్ర‌ణాళిక ర‌చిస్తున్నార‌ని అధికారులు చెప్పారు. ప‌హ‌ల్గాం దాడుల‌కు పాల్ప‌డిన ఉగ్ర‌వాదుల‌కు జ‌మ్మూలోని అనంత్‌నాగ్ జిల్లాలో సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతుంది. ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా అనే ముగ్గురు తీవ్ర‌వాదుల‌ను ఆచూకీ తెలిపిన‌ వారికి రూ. 20ల‌క్ష‌ల రివార్డును ప్రక‌టించింది భార‌త్ ప్ర‌భుత్వం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img