నవతెలంగాణ-హైదరాబాద్: ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. పలు దౌత్య పరమైన ఒప్పందాలపై పోటాపోటీగా రెండు దేశాలు ఆంక్షలు విధించుకుంటున్నాయి. దీంతో ఇరుదేశాల సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళనకుగురువుతున్నారు. ఇప్పటికే జమ్మూకశ్మీర్ ప్రజలు యుద్ధ భీతితో ముందస్తు సన్నాహాలు చేసుకున్నారు. ఒకవేళ యుద్ధం సంభవిస్తే..ఎలాంటి ఆటంకాలు రాకుండా..తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బంకర్లు తవ్వకున్నారు. అదేవిధంగా ఆహారానికి కొరత రాకుండా నిత్యావసర వస్తువులు భద్రపర్చుకున్నారు. యుద్ధ బాంబులకు తమ పంటలు బలికాకుండా..జమ్మూలోని పలు సరిహద్దు గ్రామాలు ముందస్తు పంట కోతలకు సిద్ధమైయ్యాయి. గొడ్డుగోధమను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్షిపణుల దాడులకు స్థిర ఆస్తులు ధ్వంసంకాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకుంటున్న రాజస్థాన్‌లోని సరిహద్దు గ్రామస్తులు కూడా ఇదే తరహా ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. క్షిపణుల దాడులకు తమ పశువులు, ఎండ్ల బండ్లు ధ్వంసం కాకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్షిపణుల దాడులు జరిగినా..ఎలాంటి ప్రాణహాని కలుగకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నామని స్తానికులు చెపుతున్నారు. తమ ప్రాంతాల్లో నీటి కొరత అధికంగా ఉందని , అందుకు చాలా దూరం మంచినీళ్ల కోసం నడిచి వెళ్తున్నామని సరిహద్దు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ గతంలో జరిగిన యుద్ధాలతో తాము సర్వం కోల్పోయమన్నారు. అదేవిధంగా యుద్ధ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని వాపోయారు. పహల్గాం దాడితో రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని, ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదురుకోవడానికి సంసిద్ధం ఉన్నామని ఆయా సరిహద్దు గ్రామస్తులు దీమా వ్యక్తం చేశారు.
జమ్మూ తరహాలో రాజస్థాన్‌లో ముందస్తు భదత్ర చర్యలు
- Advertisement -
- Advertisement -