Wednesday, April 30, 2025
Homeజాతీయంజాతీయ భద్రతా సలహాదారుగా అలోక్‌ జోషి

జాతీయ భద్రతా సలహాదారుగా అలోక్‌ జోషి


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జాతీయ భద్రతా సలహాదారు బోర్డ్‌ (ఎన్‌ఎస్‌ఎబి) చైర్మన్‌గా ‘రా’ మాజీ చీఫ్‌ అలోక్‌ జోషిని కేంద్రం నియమించింది. పహల్గాం ఉగ్రదాడి ఘటనతో సరిహద్దు సంబంధాల దృష్ట్యా ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఎబిని పునరుద్ధరించినట్లు సంబంధదిత వర్గాలు తెలిపాయి. మాజీ వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండర్‌ ఎయిర్‌ మార్షల్‌ పి.ఎం.సిన్హా, సదరన్‌ ఆర్మీ మాజీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎ.కె.సింగ్‌ మరియు అడ్మిరల్‌ (రిటైర్డ్‌ ) మోంటి ఖన్నా, మాజీ దౌత్యవేత్త బి.వెంకటేష్‌ వర్మ, రిటైర్డ్‌ ఐపిఎస్‌ రాజీవ్‌ రంజన్‌ వర్మలను ఎన్‌ఎస్‌ఎబిలో కొత్త సభ్యులుగా నియమించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. బుధవారం నిర్వహించిన భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img