Wednesday, April 30, 2025
Homeరాష్ట్రీయంజీఎంఆర్‌ ఏరో అకాడమీలో విమాన రక్షణ, అగ్నిమాపక శిక్షణ పున్ణప్రారంభం

జీఎంఆర్‌ ఏరో అకాడమీలో విమాన రక్షణ, అగ్నిమాపక శిక్షణ పున్ణప్రారంభం

నవతెలంగాణ-హైదరాబాద్‌
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విమానయాన శిక్షణా సంస్థ జీఎంఆర్‌ ఏరో అకాడమీలో విమాన రక్షణ, అగ్ని మాపక శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌ క్యాంపస్‌లో తిరిగి ప్రారంభించినట్టు ఆ సంస్థ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ కార్యక్రమాన్ని 2013 నుంచి 2018 మధ్యకాలంలో హైదరాబాద్‌లో 350 మందికిపైగా సిబ్బందికి శిక్షణను అందించిన తర్వాత, ఇప్పుడు మళ్లీ ప్రారంభమవుతోంది. తొమ్మిదవ బ్యాచ్‌ 2025 మే 14న ప్రారంభం కానుంది. మొత్తం 24 వారాల పాటు సాగే ఈ సమగ్ర కోర్సు ఐసీఏవో ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. ఇందులో ఆధునిక ఫైర్‌ఫైటింగ్‌ పరికరాలతో ప్రాక్టికల్‌ శిక్షణ, పరిశ్రమలో అనుభవమున్న అధ్యాపకులతో బోధన ఏర్పాట్లు ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు జీఎంఆర్‌ ఏఏ నిర్వహిస్తున్న 15కి పైగా భారతీయ విమానాశ్రయాలు, ఇండిగో, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ తదితర ప్రముఖ విమానయాన సంస్థలతో ఉన్న భాగస్వామ్యాల ప్రయోజనాలను పొందగలుగుతారని తెలియజేసింది. భారతదేశంలో విమానయాన రంగం వేగంగా అభివద్ధి చెందుతున్నప్పటికీ, నూతనంగా అభివద్ధి చెందుతున్న అనేక విమానాశ్ర యాల్లో అగ్నిమాపక, రక్షణ సిబ్బంది కోసం ఎక్కువ డిమాండ్‌ ఏర్పడుతున్నది. ఈ శిక్షణ పున్ణప్రారంభం తెలంగాణతో పాటు పరిసర దక్షిణాది రాష్ట్రాల యువతకు ముఖ్యంగా ఉపయోగపడనుందని ఆ సంస్ధ తెలిపింది. ఈ సందర్భంగా జీఎంఆర్‌ ఏరో అకాడమీ అధ్యక్షుడు మిస్టర్‌ అశోక్‌ గోపినాథ్‌ మాట్లాడుతూ ”విమానాశ్రయాల్లో అగ్నిమాపక సిబ్బంది విమానయాన భద్రతకు పరిరక్షకులుగా నిలుస్తారు.
వారు తీసుకునే తక్షణ నిర్ణయాలు, చర్యలు ఎన్నో ప్రాణాలను కాపాడతాయి. మా సైనికుల మాదిరిగానే, ఈ సిబ్బంది కూడా శ్రద్ధతోపాటు ధైర్యంగా పని చేస్తూ ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బందికి రక్షణ కల్పించేందుకు క్లిష్ట పరిస్థితుల్లో పని చేస్తారని అన్నారు. ప్రస్తుత డిమాండ్‌కు సరిపడా మానవ వనరులు లేవు. అందుకే ఈ ప్రోగ్రామ్‌ ఎంతో అవసరమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img