Thursday, May 15, 2025
Homeసినిమాజులై 4కి 'కింగ్‌డమ్‌' వాయిదా

జులై 4కి ‘కింగ్‌డమ్‌’ వాయిదా

- Advertisement -

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్‌డమ్‌’. సితార ఎంటర్‌టైన్మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈనెల 30న విడుదల చేస్తామని మేకర్లు ప్రకటించారు. అనివార్యకారణాలతో జులై 4వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘మా ప్రియమైన ప్రేక్షకులకు, మే 30న విడుదల కావాల్సిన మా ‘కింగ్‌డమ్‌’ సినిమాను జూలై 4న విడుదల చేయనున్నామని తెలియజేస్తున్నాం. ముందుగా అనుకున్నట్టుగా మే 30వ తేదీకే సినిమాని తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాం. కానీ, మన దేశంలో ఇటీవల ఊహించని సంఘటనలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్లులు, వేడుకలు నిర్వహించడం కష్టతరమని భావించి, ఈ నిర్ణయం తీసుకున్నాం. జూలై 4న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ చిత్రం, మీ ప్రేమను పొందుతుందని ఆశిస్తున్నాం.’ అని చిత్ర బృందం పేర్కొంది. విజరు దేవరకొండ తన కెరీర్‌లో అత్యంత శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. విజరుకి జోడిగా భాగ్యశ్రీ బోర్సే ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -