– ప్రతి శుక్రవారం తల్లిదండ్రులు, టీచర్ల సమావేశం
– నేటినుంచి అన్ని గ్రామాల్లో ప్రారంభం
– 12న జిల్లాస్థాయిలో ఉపాధ్యాయుల శిక్షణ : విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో బడిబాట కార్యక్రమాన్ని వచ్చేనెల ఆరో తేదీ నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం విద్యాశాఖ అధికారులతో జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం గ్రామాల్లో పంచాయతీ కార్యా లయం లేదా జన సమీకరణ ఉన్న ప్రాంతాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం)ను నిర్వహించాలని కోరారు. గ్రామాల్లోని పిల్లల తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ), స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) సభ్యులతోపాటు అంగన్‌వాడీ ఉపాధ్యా ుుల సహకారంతో నిర్వహిం చాలని సూచించారు. జూన్ ఆరో తేదీన మెగా పీటీఎంను నిర్వహించాలని తెలిపారు. శుక్రవారం (ఈనెల తొమ్మిదిన), 16, 23, 30తోపాటు జూన్ ఆరో తేదీన పీటీఎంలను నిర్వహించాలని పేర్కొన్నారు. గ్రామాల్లోని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదయ్యేలా చూడాలని ఆదేశించారు. విద్యార్థుల నమోదును పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈనెల 12న జిల్లాస్థాయిలో ఉపాధ్యాయుల శిక్షణను చేపట్టాలని కోరారు. మంచి సౌకర్యాలుండేలా ఇంజినీరింగ్ కాలేజీలు వంటి వాటిని ఎంపిక చేయాలని తెలిపారు. మూడు రోజులపాటు శిక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు ముందస్తు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఈనెల 25 నాటికి ఉపాధ్యాయుల శిక్షణ పూర్తి కావాలని డీఈవోలను ఆదేశించారు. నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలను విద్యార్థులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నోట్ పుస్తకాలు పాఠశాలలకు చేరాయని పేర్కొన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్ వర్క్ పుస్తకాలు ఈనెల 15 నాటికి చేరతాయని వివరించారు. నోటి పుస్తకాల రవాణాకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలనీ, ఈనెల 15 నాటికి మండల కేంద్రాలకు పంపిణీ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల్లేని (జీరో ఎన్‌రోల్‌మెంట్) పాఠశాలలను గుర్తించాలని తెలిపారు. తక్కువ విద్యార్థులున్న బడులు, విద్యార్థుల నమోదు తగ్గుతున్న పాఠశాలల్లో పిల్లల నమోదును పెంచాలని కోరారు. విద్యార్థుల నమోదు తగ్గడానికి గల కారణాలను పరిశీలించాలని సూచించారు.
జూన్ 6 నుంచి బడిబాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES