Wednesday, September 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుటీజీపీఎస్సీకి ఊరట

టీజీపీఎస్సీకి ఊరట

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్‌-1 అంశంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చేనెల 15కి వాయిదా వేసింది. గ్రూప్‌-1 తుది మార్కుల జాబితా, జనరల్‌ ర్యాంకింగ్స్‌ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మెయిన్స్‌ జవాబు పత్రాలను 8 నెలల్లో పునర్‌ మూల్యాంకనం చేయించాలని.. లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టి స్టే విధించింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని సీజే జస్టిస్‌ ఏకే సింగ్‌ స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -