Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలుటెక్సాస్ రోడ్డు ప్ర‌మాదంలో తెలుగు విద్యార్థిని మృతి

టెక్సాస్ రోడ్డు ప్ర‌మాదంలో తెలుగు విద్యార్థిని మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలోని టెక్సాస్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఏపీలోని గుంటూరు జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్‌కు చెందిన వంగ‌వోలు దీప్తి మృతి చెందారు. కొన్నాళ్ల క్రితం ఆమె టెక్సాస్‌లోని డెంట‌న్ న‌గ‌రంలో యూనిర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. ఈ నెల 12న త‌న స్నేహితురాలు మేడికొండూరుకు చెందిన స్నిగ్ధ‌తో క‌లిసి రోడుపై న‌డిచి వెళ్తున్న స‌మ‌యంలో వారిని వేగంగా వ‌చ్చిన ఓ కారు బ‌లంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో దీప్తి త‌ల‌కు తీవ్ర గాయం కాగా, స్నిగ్ధ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింది. దాంతో వారిని చికిత్స కోసం ఆసుప‌త్రిలో చేరిపించారు. దీప్తి స్నేహితురాళ్లు ఈ ప్రమాదం గురించి ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. ఆయన గుంటూరులోని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసానిచంద్రశేఖర్‌ క్యాంప్‌ ఆఫీసులో సంప్రదించగా… సమాచారాన్ని అమెరికాలో ఉన్న పెమ్మసానికి తెలియజేశారు. వెంటనే పెమ్మసాని తన బృందాన్ని అప్రమత్తం చేసి మెరుగైన చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. గుంటూరులో ఉన్న పెమ్మసాని సోదరుడు రవిశంకర్‌ తన స్నేహితులు నవీన్‌ కు క్రౌడ్‌ ఫండింగ్‌ వచ్చేలా చూడాలని సూచించారు. దాంతో ఆన్‌ లైన్‌ లో విరాళాల రూపంలో 80వేల‌ డాలర్ల వరకు రావ‌డంతో ఆ డ‌బ్బును చికిత్సకు వినియోగించారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చనిపోయింది. శనివారానికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈమేరకు ఏర్పాట్లు చేసినట్లు పెమ్మసాని రవిశంకర్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img