రాచరికాల కాలంలో రాజు దైవాంశ సంభూతుడనేవారు. ఇప్పుడు రాజరికాలు లేవు, ఆనాటి రాజ్యాలూ లేవు. ప్రజాస్వామ్యం ఆధునిక పరిపాలన రీతి అయినా, కొంతమంది దేశాధినేతలు తమకు తామే దైవంశ సంభూతులమని అనుకుంటున్నారు. ప్రజలకు మంచి పరిపాలన అందించడం కన్నా, పౌరులను శిక్షించడంలోని ఈ దైవాంశ సం’బూతు’ను చూపిస్తున్నారు. టారిఫ్ గురించి తమతో మొరపెట్టుకోవటానికి 70 దేశాలు వేచి ఉన్నాయని ట్రంప్ ‘బూతు’ సమేతంగా సెలవిచ్చాడు. అలాంటి దైవాంశ తనలో కూడా ఉందని మన ప్రధాని మోడీ కూడా చెప్పుకున్నారన్న విషయం తెలిసినదే కదా. అలా అనుకోబట్టే, అందరి ‘తిక్క’ కుదర్చడానికి టారిఫ్ యుద్ధాలు, దేశ బహిష్కరణలు, ప్రభుత్వ ఉద్యోగులను గెంటేయటం లాంటి తల తిక్క పనులు మొదలుపెట్టాడు ట్రంప్. ఆయన చేసిన ఈ పనులకు మనదేశంలో జరిగిన నోట్ల రద్దు, జీఎస్టీలతో పోలిక కనపడు తున్నది. బహిరంగంగా ఆదేశించే అవకాశం లేదు గానీ, తననెదిరించిన ఇతర దేశాల అధిపతుల తలలు తన కోటగుమ్మానికి వేలాడదీయాలని ఆశ ట్రంప్‌నకు ఉంది. కెనడా, ఇరాన్, పాలస్తీనా, గ్రీన్ ల్యాండ్ దేశాలను బెదిరించటంలో ఈ ఆశ తాలూకా ఛాయలు కనపడటం లేదా?
అమెరికా ‘చక్రవర్తి’ మొదలుపెట్టిన ఈ వాణిజ్య సుంకాల యుద్ధం కొత్తదేం కాదు అంటున్నారు చరిత్రకారు లు. 1930లో అ మెరికాలో చేసిన స్మూట్ -హేలే చట్టం నుంచి అద్దెకు తెచ్చుకున్న ది. ఆర్థిక మాం ద్యం రోజు లలో అమెరికా తన పరి శ్రమలను రక్షించు కోవడా నికై దిగుమతి పన్ను లను పెంచడం కోస మే అమెరికా 31వ ప్రెసిడెంట్ హెర్ బర్ట్ హూవర్ ఈ చట్టాన్ని చేశారు. ఆర్థిక నిపు ణులు ఎంత చెప్పినా విన కుండా, పారిశ్రా మికవేత్తల మాట విని దిగుమతుల మీద ఎక్కువ పన్నులు వేయటంతో, భౌగోళికంగా వాణిజ్యం క్షీణించింది. ప్రపంచానికి పెద్ద విపత్తును, విషాదాన్ని మిగిల్చిన ‘మహా మాంద్యం’ మరింత తీవ్రంగా దారి తీసింది. ఆ తరువాతైన గానీ స్మూట్- హెలే చట్టాన్ని ఎత్తివేయటం జరగలేదు. దానికి బదులుగా ఈ ఆర్ధిక పరిస్థితి నుంచి బయటపడటానికి అమెరికా 32 వ అధ్యక్షుడు రూజ్ వెల్ట్ రెసిప్రోకల్ ట్రేడ్ అగ్రిమెంట్ యాక్టు, 1934 చేశాడు. రూజ్ వెల్ట్ చట్టంతో టారిఫ్ వేసే అధికారం పార్లమెంటు నుంచి అమెరికా ప్రెసిడెంటు చేతిలోకి పోయింది. రూజ్ వెల్ట్ ఆర్ధిక మాంద్యం నుంచి బయటపడటానికి వాడిన రెసిప్రోకల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఇప్పుడు మాంద్యం చేదు మాత్రను బలవంతంగా ప్రపంచం చేత మింగించటానికి ట్రంప్ వాడుతున్నాడు. అయితే, ప్రపంచం చేత చేదు మాత్రను మింగించిన ట్రంప్, తనకు తన మిత్రులకు తీపి గుళికలు తినిపించుకున్నాడు. టారిఫ్ పెంపు అమలులోకి వస్తుందని చెప్పిన ఏప్రిల్ 9 ఉదయం ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదిక నుంచి షేర్లు కొనటానికి సరియైన సమయం ఇదే అని సలహా వదిలాడు. ఏ దేశాధ్యక్షుడు షేర్ మార్కెట్ల విషయంలో సలహాలు ఇవ్వటం జరగదు. అందరిదీ ఒక దారి, మన ట్రంప్ ది మరో దారి కదా. సలహా ఇచ్చేశాడు. అప్పటికి అన్ని షేర్లూ నేల చూపులు చూస్తున్నాయి. ఆ తరువాత నాలుగు గంటల్లోనే టారిఫ్ అమలును 90 రోజులు వాయిదా వేశాడు. నేలకంటిన షేర్లు తిరిగి ఆకాశంలోకి లేచాయి. ట్రంప్ సలహాకు అర్ధం దొరికింది. ట్రంప్ స్వయంగా తన అధికార బందంతో మాట్లాడుతూ, ఆ రోజు షేర్ మార్కెట్‌లో వాళ్లు 250 కోట్ల డాలర్లు, 90 కోట్ల డాలర్లు సంపాదించటం గురించి పరిహాసమాడటం జరిగింది. ఉదయం పడిపోయిన షేర్లు మార్కెట్ ముగిసే సమయానికి 4లక్షల కోట్ల డాలర్లు తిరిగి లాభపడ్డాయి. ఇదంతా ట్రంప్ మహత్యమే అన్నారు షేర్ మార్కటీర్లు. మార్కెట్ లో చేసిన మోసం అని వారు ఆరోపించారు. మస్క్, ట్రంప్ షేర్లు కూడా లాభపడ్డాయి. ఉదయం టారిఫ్ పెంపుదల ప్రకటించి, నాలుగు గంటలలో దానిని వాయిదా వేయటం, ట్రంప్ స్వయంగా షేర్లు కొనటానికి ఇదే సరియైన సమయం అని సందేశం ఇవ్వటం కుంభకోణం కాక మరేం అవుతుంది. చివరికి ప్రపంచానికి ఆర్ధిక మాంద్యం, సొంత మనుషులకు డబ్బుల మూట మిగులుతాయి కాబోలు.
ట్రంప్ కాసుల వేట
- Advertisement -
RELATED ARTICLES