నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయెల్ సైన్యం సిరియా అధ్యక్ష భవనమే లక్ష్యంగా క్షిపణి దాడికి పాల్పడింది. శుక్రవారం తెల్లవారుజామున డమాస్కస్ లోని ప్రెసిడెంట్ అహ్మద్ హుస్సేన్ అల్-షరా’ నివాసానికి సమీపంలోనే ఈ దాడి చేసినట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆదేశ రక్షణ మంత్రి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దక్షిణ డమాస్కస్ సమీపంలో బలగాల మోహరింపు ,డ్రూజ్ సమాజానికి ముప్పు వాటిల్లితే సహించలేదని, ఈ దాడితో సిరియాకు తమ సందేశం ఏమిటో అర్థమైందని ప్రధాని చెప్పారు. సిరియా హైయత్ తహ్రీర్ అల్‌షమ్ (హెచ్‌టిఎస్) అనుబంధ సాయుధ గ్రూపులు, డమాస్కస సమీపంలోని డ్రూజ్ మైనారిటీల మధ్య రోజుల తరబడి ఘర్షణలు జరిగిన తర్వాత ఈ దాడి చోటు చేసుకుంది. పీపుల్స్ ప్యాలెస్‌కు దగ్గరగా ఈదాడి జరిగిందని ప్రభుత్వ అనుకూల సిరియన్ వర్గాలు తెలిపాయి.
డమాస్కస్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి
- Advertisement -
RELATED ARTICLES