జిల్లా మలేరియా అధికారి, డిప్యూటీ డిఎంహెచ్ఒ తూకరం రాథోడ్.
నవతెలంగాణ డిచ్ పల్లి :
డెంగ్యూ జ్వరానికి మందు లేదని, అయినప్పటికీ ముందస్తుగా దానిని గుర్తించడం తదనంతరం చికిత్స చేయడం వలన అరోగ్యం బాగుంటుందని జిల్లా మలేరియా అధికారి, నిజామాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఒ డాక్టర్ తుకారం రాథోడ్ పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ డెంగ్యూ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ ఆధ్వర్యంలో ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ర్యాలీ నిర్వహించిన అనంతరం అవగాహన సదస్సులో డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా థీమ్” డెంగ్యూను నివారించడానికి నీటి నిలువలను పరిశీలించండి,పరిశుభ్రపరచండి, తొలగించండి, డెంగ్యూ వ్యాధి”ఈడెస్ ఈజిప్టీ (Aedes aegypti mosquito) దోమల ద్వారా సంక్రమించే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని వివరించారు. ఈ దోమ కుట్టినట్లైతే అధిక జ్వరం మరియు శరీర నొప్పులు మొదలౌతాయని, డెంగ్యూ జ్వరానికి మందు లేదని అయినప్పటికీ ముందస్తుగా గుర్తించడం, చికిత్స చేయడం వలన లక్షణాలు, నిర్వహణలో సహాయపడుతుంద న్నారు.దింతోనే మరణాలను నివారించవచ్చని సూచించారు.
డెంగ్యూ లక్షణాలు:
తలనొప్పి, కండరాల/కీళ్ల నొప్పి, వికారం, వాంతులు అవుతున్నాయి. కళ్ళ వెనుక నొప్పి, దద్దుర్లు, కడుపు నొప్పి లేదా సున్నితత్వం, ముక్కు నుంచి రక్తం కారుతుంది. చిగుళ్ల నుంచి రక్తం కారుతోంది, అలసట, చిరాకు, అశాంతి, వాంతి లేదా మలంలో రక్తం మొదలైనవి.
రక్త పరీక్షలు: రక్త పరీక్షల ద్వారా రక్తంలో డెంగ్యూ వైరస్ ఉనికిని గుర్తించి నిర్ధారించవచ్చు. డెంగ్యూ జ్వరం లక్షణాలను నిర్ధారించడానికి ఉపయోగించే అత్యంత సాధారణ రక్త పరీక్ష NS1 యాంటిజెన్ పరీక్ష. పూర్తి రక్త గణన (CBC / CBP) – వ్యాధి తర్వాత తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌ని తనిఖీ చేయడం, హెమటోక్రిట్, హిమోగ్లోబిన్ మరియు ఎర్ర రక్త కణాల (RBC) గణన (రక్తహీనత యొక్క రుజువు) తగ్గుదలని గుర్తించడం కోసం వ్యాధి యొక్క తరువాతి దశలలో విలక్షణమైనది డెంగ్యూ జ్వరంతో సంబంధం ఉన్న తీవ్రమైన రక్తహీనత
డెంగ్యూ సెరోలజీ పరీక్ష (డెంగ్యూ IgG మరియు IgM) – ఒక వ్యక్తి వైరస్‌కు గురైనప్పుడు రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రతిరోధకాలను గుర్తించడానికి, ప్రైమరీ మరియు సెకండరీ ఇన్ఫెక్షన్‌లకు గురైన తర్వాత కనీసం 4 రోజుల తర్వాత ఈ పరీక్షలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
డెంగ్యూ వైరస్ యాంటిజెన్ డిటెక్షన్ (NS1) – డెంగ్యూ వైరల్ ఇన్‌ఫెక్షన్‌ని నిర్ధారించడానికి, ఈ పరీక్ష డెంగ్యూ ఇన్‌ఫెక్షన్‌ను ముందస్తుగా నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది మరియు డెంగ్యూ ఇన్‌ఫెక్షన్ తర్వాత 1-2 రోజులలోపు చేయవచ్చని చెప్పారు.
విశ్రాంతి – ద్రవాలు (డ్రింక్స్):
డెంగ్యూ చికిత్స ప్రధానంగా సహాయకరంగా ఉంటుందని, నిర్జలీకరణాన్ని నివారించడానికి రోగులు విశ్రాంతి తీసుకోవడానికి, పుష్కలంగా ద్రవాలు త్రాగడానికి సలహా ఇస్తారని ఆయన అన్నారు. తీవ్రమైన సందర్భాల్లో, ఆసుపత్రిలో చేరడం అవసరం కావచ్చు. నిర్జలీకరణాన్ని నివారించడానికి రోగులకు ఇంట్రావీనస్ ద్రవాలు అవసరమవుతాయి. రక్తస్రావం సంకేతాల కోసం పర్యవేక్షించవలసి ఉంటుంది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ క్రిస్టినా, ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ భువన, ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్గో,వర్ధన్ ఆరోగ్య కార్యకర్తలు, ఎమ్ ఎల్ హెచ్ పి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు