Wednesday, April 30, 2025
Homeరాష్ట్రీయండ్రగ్స్‌ వాడకం దేశ ప్రగతికి గొడ్డలి పెట్టు

డ్రగ్స్‌ వాడకం దేశ ప్రగతికి గొడ్డలి పెట్టు

– ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం
– హనుమకొండ జిల్లాలో డ్రగ్స్‌ నిర్మూలన పోరుయాత్ర
నవతెలంగాణ-భీమదేవరపల్లి
డ్రగ్స్‌ వాడకం దేశ ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారిందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని మాణిక్యపూర్‌, రత్నగిరి, వంగర, రంగయ్యపల్లి గ్రామాల్లో జేఏసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన డ్రగ్స్‌ నిర్మూలన పోరుయాత్రకు ఆయన హాజరై మాట్లాడారు. డ్రగ్స్‌ వాడకాన్ని నిర్మూలించే బాధ్యత అందరిపై ఉన్నదని అన్నారు. సిగరెట్‌, గుట్కా, అంబర్‌, గంజాయి వంటి మత్తు పదార్థాలు వాడటం వల్ల కుటుంబాలు ఆర్థికంగానే కాకుండా మానసికంగానూ దెబ్బ తింటున్నాయని తెలిపారు. డ్రగ్స్‌ నిర్మూలన కార్యక్రమం హుస్నాబాద్‌ నియోజకవర్గంలో మొదట ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. ప్లెక్సీలు, ప్ల కార్డ్స్‌ చేత పట్టుకొని గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జేఏసీ హుస్నాబాద్‌ నియోజకవర్గ చైర్మెన్‌ కవ్వా లక్ష్మారెడ్డి, మండల జేఏసీ చైర్మెన్‌ డేగల సారయ్య, నాయకులు చెప్పియాల ప్రకాష్‌, కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, ముక్కెర రాజు, విద్యాసాగర్‌, ప్రొఫెసర్‌ వీరన్ననాయక్‌, డాక్టర్‌ ఏదులాపురం తిరుపతి, ఒగ్గే శేఖర్‌, గాండ్ల పద్మ, సిడిపిఓ స్వరూప, ఏపీఎం దేవానందం, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజతోత్సవ సభ టీఆర్‌ఎస్‌ పార్టీకా.. బీఆర్‌ఎస్‌ పార్టీకా..
అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. కేసీఆర్‌ పెట్టే రజతోత్సవ సభ టీఆర్‌ఎస్‌ పార్టీ దో.. బీఆర్‌ఎస్‌ పార్టీదో వారికే తెలియని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణతో తెగతెంపులు చేసుకొని బీఆర్‌ఎస్‌గా మారిందని తెలిపారు. సకల జనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌, రైల్‌ రోకో లాంటి కార్యక్రమాలు చేసి వందలాది మంది అమరులైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారంతో వారిని విస్మరించారని ఆరోపించారు. ధర్నాచౌక్‌ను ఎత్తివేసి నిరసన తెలిపే హక్కును కేసీఆర్‌ కాలరాశారన్నారు. ఒక్కడినే తెలంగాణ తెచ్చాననే అహంకార భావంతో ప్రజల్లో చులకన అయ్యారన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మునిగిపోయే నావ లాంటిదని, ఇక అధికారంలోకి రావడం ఒక కలగానే మారిపోతుందన్నారు. రాష్ట్రాన్ని నిరుద్యోగుల తెలంగాణగా మార్చడం వల్ల సైబర్‌ క్రైమ్‌ పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img