నవతెంగాణ-హైదరాబాద్: హెరాల్డ్ కేసు విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీలఫై ఈడీ ఛార్జీషీటు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తుందని, మోడీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ..ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు ఆపార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. దీంతో దేశరాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఆ పార్టీశ్రేణులు పెద్దయోత్తున నిరసన ర్యాలీ చేపట్టాయి. అప్రమత్తమైన పోలీసులు నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. అక్కడే రోడ్డు మీద బైటాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు ఆందోళనకారులు. ప్రజలను ఏమార్చడానికే బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ అధినాయకత్వంపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తుందని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ దర్యాప్త సంస్థలను స్వప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. బీహార్, అసోం రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో ఓటమి చెందుతామనే..బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థల చేత అక్రమ కేసులు బనాయించిందని ఎంపీ ఇమ్రాన్ ప్రతాపగర్హి విమర్శించారు. ఈ తరహా కేసులు నమోదు చేసి ప్రతిపక్షాలను భయపెట్టాలని మోడీ సర్కార్ చూస్తుందని మండిపడ్డారు. గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఛార్జీషీటు దాఖలు చేయించారని చెప్పారు. అక్రమ కేసులతో ప్రతిపక్షాల గొంతును నొక్కాలని బీజేపీ చూస్తుందని, కానీ అది అసాధ్యమని ఎంపీ ఇమ్రాన్ అన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన..
- Advertisement -