నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో పార్లమెంట్ వేదికగా ఆల్ పార్టీ మీటింగ్ కొనసాగుతుంది. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు శాంతి చేకూరాలని నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు,జేపీ నడ్డా విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొనగా… రాజ్యసభ విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభ విపక్షనేత రాహుల్ గాంధీతోపాటు ఎస్పీ నుంచి గోపాల్ యాదవ్, సుప్రియ సూలే(NCP-SP), శ్రీకాంత్ షిండే(NCP) , ప్రఫుల్ పటేల్(NCP), ఆర్జేడీ నుంచి ప్రేమ్ చంద్ గుప్తా,తిరుచి శివ(DMK), సస్మిత్ పాత్ర(BJD), సంజయ్ సింగ్(AAP), మిథున్‌రెడ్డి(YSRC), సుదీప్ బందోపాధ్యాయ(TMC) ఆయా పార్టీలనుంచి తదితర నేతలు హాజరయ్యారు. పహాల్గాం దాడి తదనంతర పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రస్తుతం దేశంలో భద్రతా పరమైన అంశాలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీలో కొనసాగుతున్న ఆల్ పార్టీ మీటింగ్
- Advertisement -