నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలి నలుగురు మరణించారు. మృతులలో ముగ్గురు పిల్లలు, ఒక మహిళ ఉన్నారు. బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, ఈదురుగాలులు వలన ఢిల్లీ విమానాశ్రయంలో మూడు విమానాలను దారి మళ్లించారు. 100కి పైగా విమానాలు ఆలస్యం అయ్యాయి.అనేక ప్రాంతాలలో చెట్లు కూలిపోయినట్లు, నీటితో నిండిన రోడ్లలో ప్రజలు చిక్కుకున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఐఎండీ డేటా ప్రకారం, గత మూడు గంటల్లో, నగరంలోని ప్రాథమిక అబ్జర్వేటరీ అయిన సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రం 77 మి.మీ వర్షపాతం నమోదు చేసింది. లోధి రోడ్డులో 78 మి.మీ, పాలం 30 మి.మీ, నజాఫ్‌గఢ్ 19.5 మి.మీ, పితంపుర 32 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
ఢిల్లీలో భారీ వర్షాలు..ఇల్లు కూలి నలుగురు మృతి
- Advertisement -
RELATED ARTICLES