– లక్నో సూపర్‌జెయింట్స్‌పై ఘన విజయం
– లక్నో 159/6, ఢిల్లీ 161/2
లక్నో : ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతుంది. ఐపీఎల్18 లీగ్ దశలో ఆ జట్టు ఆరో విజయం నమోదు చేసింది. పేసర్ ముకేశ్ కుమార్ (4/33) నాలుగు వికెట్ల ప్రదర్శనతో తొలుత లక్నో సూపర్‌జెయింట్స్ 159/6 పరుగులకే పరిమితం కాగా.. స్వల్ప లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే ఊదేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ అభిషేక్ పోరెల్ (51, 36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), కెఎల్ రాహుల్ (57 నాటౌట్, 42 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. అక్షర్ పటేల్ (34 నాటౌట్, 20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) కెప్టెన్సీ ధనాధన్‌తో మెప్పించాడు. కరుణ్ నాయర్ (15) నిరాశపరిచినా మరో 13 బంతులు ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్ ఎడెన్ మార్‌క్రామ్ (52, 33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (45, 36 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించి శుభారంభం అందించిఆన.. మిడిల్ ఆర్డర్ తేలిపోయింది. నికోలస్ పూరన్ (9), అబ్దుల్ సమద్ (2), డెవిడ్ మిల్లర్ (14 నాటౌట్), రిషబ్ పంత్ (0) విఫలం అయ్యారు. ఆయుశ్ బదాని (36, 21 బంతుల్లో 6 ఫోర్లు) ఆఖర్లో విలువైన పరుగులు చేశాడు.
ఢిల్లీ అలవోకగా..!
- Advertisement -