Tuesday, April 29, 2025
Homeజాతీయంఢిల్లీ సీఎం భర్త అనధికారంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు : మాజీ సీఎం అతిశీ

ఢిల్లీ సీఎం భర్త అనధికారంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు : మాజీ సీఎం అతిశీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి రేఖాగుప్తా భర్త మనీశ్ గుప్తాపై ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, మాజీ సీఎం అతిశీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అనధికారంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు అధికారులతో సమావేశమైన ఫొటోను అతిశీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
‘ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త భర్త మనీష్‌ గుప్తా పలువురు అధికారులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో సర్పంచిగా మహిళ ఎన్నికైతే ప్రభుత్వ విధులను ఆమె భర్తే చూసుకుంటారని మనం గతంలో వినేవాళ్లం. కానీ, ఒక మహిళా సీఎం చేయాల్సిన పనులను ఆమె భర్త చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. ఆమెకు ప్రభుత్వ విధులు ఎలా నిర్వర్తించాలో తెలియదా?’ అని అతిశీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఢిల్లీలో విద్యుత్‌ కోతలు, ప్రయివేటు పాఠశాలల ఫీజులు పెరిగిపోవడానికి కారణం ఆయా శాఖల్లో సీఎం ప్రమేయం లేకపోవడమేనా? అని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img