నవతెలంగాణ – హైదరాబాద్: తజికిస్థాన్‌లో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.4 పాయింట్లుగా నమోదైంది. ఆదివారం ఉదయం 9.54 గంటల ప్రాంతంలో భూమి కంపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాగా, మయన్మార్‌లో నేడు మరోసారి భూకంపం సంభవించింది. ఇక్కడి మీక్తిలియా ప్రాంతంలో 5.5 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు.
- Advertisement -