Thursday, May 1, 2025
Homeజాతీయంతహవ్వూర్ కేసులో కీల‌క ప‌రిణామం..

తహవ్వూర్ కేసులో కీల‌క ప‌రిణామం..

న‌వతెలంగాణ‌- హైద‌రాబాద్‌: 26/11 ముంబయి ఉగ్రదాడి నిందితుడు తహవ్వూర్‌ రాణా వాయిస్‌, చేతిరాత నమూనాలను సేకరించేందుకు ఢిల్లీ కోర్టు ఎన్‌ఐకి అనుమతి ఇచ్చింది. ఏప్రిల్‌ 28న రాణా కస్టడీని 12 రోజుల పాటు పొడిగించిన ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) న్యాయమూర్తి చందర్‌జిత్‌ సింగ్‌, ఏజన్సీ దాఖలు చేసిన దరఖాస్తుపై ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు గురువారం ప్రకటించాయి. ఈ దాడుల ప్రధాన కుట్రదారుడు డేవిడ్‌ కొలెమన్‌ హెడ్లీ అలియాస్‌ దావూద్‌ గిలానీకి సన్నిహితుడు, అమెరికా పౌరుడైన రాణాను ఏప్రిల్‌ 10న భారత్‌కు తీసుకువచ్చారు. 2008 నవంబర్‌ 26న 10మంది పాకిస్తానీ ఉగ్రవాదుల బృందం సముద్రమార్గాన్ని వినియోగించి ముంబయిలోకి చొరబడి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 166 మంది మరణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img