- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణాను యూఎస్ నుంచి తీసుకొచ్చేందుకు ఎన్ఐఏ గల్ఫ్ స్ట్రీమ్ G550 జెట్‌ను ఉపయోగించింది. ఆగకుండా 12,500KM ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. ఇందులో 19 మంది ప్రయాణించవచ్చు. ఈ జెట్ విలువ దాదాపు రూ.500-600కోట్లు కాగా భారత్ రూ.4 కోట్లు రెంట్ చెల్లించినట్లు తెలుస్తోంది. విశాలమైన క్యాబిన్లు, పటిష్ఠ భద్రత కలిగిన ఈ విమానాన్ని ప్రభుత్వాధినేతలు, బిలియనీర్లు ఎక్కువగా వినియోగిస్తారు.
