Sunday, May 11, 2025
Homeసినిమాతెలుగులోనూ బ్లాక్‌బస్టర్‌ ఖాయం

తెలుగులోనూ బ్లాక్‌బస్టర్‌ ఖాయం

- Advertisement -

కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎం.వి.రాధాకష్ణ తెలుగులో విడుదల చేస్తున్న కన్నడ చిత్రం ‘వీర చంద్రహాస్‌’. గతంలో శివరాజ్‌ కుమార్‌ నటించిన ‘వేద’, ప్రజ్వల్‌ దేవరాజ్‌ నటించిన ‘రాక్షస’ చిత్రాలను తెలుగులో రిలీజ్‌ చేసిన ఆయన తాజాగా ‘వీర చంద్రహాస’ తెలుగు రైట్స్‌ని దక్కించుకున్నారు. అతి త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ‘కేజీయఫ్‌, సలార్‌’ లాంటి యాక్షన్‌ చిత్రాలకు సంగీతం అందించి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఒక సంచలనం సష్టించిన రవి బస్రూర్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించారు.
హోంబలే ఫిల్మ్స్‌ సమర్పణలో ఓంకార్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఎన్‌.ఎస్‌.రాజ్‌కుమార్‌ నిర్మించారు. ఏప్రిల్‌ 18న కన్నడలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ మూవీ తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌ను హీరో విశ్వక్‌ సేన్‌ సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’టైటిల్‌తో పాటు ట్రైలర్‌ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. రవి బస్రూర్‌ మల్టీ టాలెంట్‌ ఉన్న వ్యక్తి. ఇప్పటి వరకు ఆడియెన్స్‌ను తనదైన సంగీతంతో అలరించగా, డైరెక్టర్‌ గానూ తానెంటో ప్రూవ్‌ చేశారు. ఎమ్‌వీ రాధాకష్ణ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు.
‘కన్నడలో విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌తో పాటు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్‌ దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తారు. ఆ కోవలోనే ఉన్న ఈ చిత్రాన్ని సైతం బ్లాక్‌బస్టర్‌ చేస్తారని ఆశిస్తున్నాను’ అని నిర్మాత ఎమ్‌వీ రాధాకష్ణ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -