Sunday, May 4, 2025
Homeతాజా వార్తలుదంచికొట్టిన ర‌స్సెల్.. కేకేఆర్ స్కోర్ ఎంతంటే..?

దంచికొట్టిన ర‌స్సెల్.. కేకేఆర్ స్కోర్ ఎంతంటే..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కోల్ క‌తా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌క‌త్తా నైట్ రైడ‌ర్స్ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది కేకేఆర్. ఆండ్రీ రస్సెల్ 57 ప‌రుగుల‌తో క‌దంతొక్కాడు. అంగ్‌క్రిష్‌ రఘువంశీ 44, రెహ్మనుల్లా గుర్బాజ్ 35, అజింక్య రహానె 30 ర‌న్స్‌తో రాణించారు. ఆకాశ్ వేసిన చివర ఓవర్‌లో రింకు వరుసగా 4, 6, 6 బాదేశాడు. దీంతో రాజ‌స్థాన్ ముందు 207 ప‌రుగుల కొండంత ల‌క్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుధ్విర్ సింగ్, మహీశ్‌ తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -