Tuesday, April 29, 2025
Homeజాతీయంద‌ళితుల‌పై దాడుల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నెంబ‌ర్ వ‌న్: అఖిలేష్ యాద‌వ్

ద‌ళితుల‌పై దాడుల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నెంబ‌ర్ వ‌న్: అఖిలేష్ యాద‌వ్

యూపీ బీజేపీ ప్ర‌భుత్వంపై ఎస్పీ అధినేత‌, ఎంపీ అఖిలేష్ యాద‌వ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ద‌ళితుల‌పై దాడుల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంద‌న్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజ‌స్థాన్‌, మ‌ధ్యప్ర‌దేశ్, బీమార్, ఒడిసా, మ‌హారాష్ట్రల్లో త‌రుచుగా అట్టుడుగు వ‌ర్గాల‌పై, ఆ వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌ల‌పై దాడులు నిత్య‌కృత్య‌మ‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ త‌ర‌హా దాడుల‌పై బీజేపీ ప్ర‌భుత్వం బాధ్య‌త‌వ‌హించాల‌ని, ఎందుకుయ ఆయా రాష్ట్రాల్లో ద‌ళితుల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని అఖిలేష్ యాద‌వ్ ప్ర‌శ్నించారు. ఆ వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌ల ప‌ట్ల అస‌భ్య‌ప్ర‌వ‌ర్త‌న,వేధింపులకు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. యూపీ రాష్ట్రంలో ద‌ళితుల‌పై ఎక్కువ‌గా దాడులు జ‌రుగుతున్నాయ‌ని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్ప‌ష్టం చేసిందని వివ‌రించారు. ‘బీజేపీ..సాంప్రదాయ ఆధిపత్యవాదుల పార్టీ. ఆ పార్టీ ఆలోచన పూర్తిగా భూస్వామ్యంగా ఉంటుంది. పేదలు, అణగారిన వర్గాలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, గిరిజనులు చిద‌రింపుల‌కు గురువుతున్నారు’ అని మీడియాతో అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img