Wednesday, May 7, 2025
Homeఆటలుదూసుకొస్తున్న ముంబయి

దూసుకొస్తున్న ముంబయి

- Advertisement -

– వరుసగా నాల్గో గెలుపుతో మూడో స్థానంలోకి
– సన్‌రైజర్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం
హైదరాబాద్‌:
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్ల ఆటతీరు మారలేదు. ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న హైదరాబాద్‌ బ్యాటర్లు.. ఉప్పల్‌ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లోనూ నిరాశపరిచారు. దీంతో ముంబయి చేతిలో ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడారు. తొలుత ముంబయి బౌలర్లు సమిష్టిగా రాణించడంతో 143పరుగులకే పరిమితమైన సన్‌రైజర్స్‌ జట్టు.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేక 15.4ఓవర్లలోనే ముంబయి చేతిలో చిత్తుగా ఓడింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(70), సూర్యకుమార్‌ యాదవ్‌(40నాటౌట్‌) ముంబయి గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఈ గెలుపుతో ముంబయి జట్టు వరుసగా నాల్గో విజయాన్ని సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి ఎగబాకింది. తొలుత హైదరాబాద్‌ జట్టు 13పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. విధ్వంసక ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌(0)ను బౌల్ట్‌ డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్‌ కిషన్‌(1) సైతం దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రికెల్టన్‌ చేతికి చిక్కాడు. ఆ షాక్‌ నుంచి తేరుకునే లోపే.. అభిషేక్‌ శర్మ(8), నితీశ్‌ కుమార్‌ రెడ్డి(2)లు పేలవ షాట్లతో పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో, 14 పరుగులకే కమిన్స్‌ సేన నలుగురు ప్రధాన ఆటగాళ్ల వికెట్లు కోల్పోయింది. ముంబయి ఇండియన్స్‌ పేసర్ల ధాటికి టాపార్డర్‌ మరోసారి విఫలంకావడంతో.. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆరెంజ్‌ ఆర్మీని హెన్రిచ్‌ క్లాసెన్‌ ఆదుకున్నాడు. ఆ దశలో క్లాసెన్‌(71) అర్ధసెంచరీకి తోడు.. అభినవ్‌ మనోహర్‌(43) ఆచి తూచి ఆడారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 143పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. పవర్‌ ప్లేలో రికార్డు స్కోర్‌ కొట్టిన జట్టు అత్యల్ప స్కోర్‌ నమోదు చేసింది. ముంబయి పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(4/26) విజృంభణతో 14 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో హెన్రిచ్‌ క్లాసెన్‌(71) స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో అలరించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతమైదానంలో తడబడినా.. ఆఖరికి పోరాడగలిగే స్కోర్‌ చేసింది. ఒత్తిడిలోనూ అర్ధసెంచరీ కొట్టిన క్లాసెన్‌.. ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌ అభినవ్‌ మనోహర్‌(43)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐదో వికెట్‌కు వీరు 99 పరుగులు జోడించారు. దీంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో7 వికెట్ల నష్టానికి 143 పరుగులు స్కోర్‌ చేయగలిగింది. ముంబయి బౌలర్లు బౌల్ట్‌కు నాలుగు, దీపక్‌ చాహర్‌కు రెండు, బుమ్రా, హార్దిక్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.
స్కోర్‌బోర్డు. :
ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి అండ్‌ బి)ఉనాద్కట్‌ 11, రోహిత్‌ శర్మ (సి)అభిషేక్‌ శర్మ (బి)ఈషన్‌ మలింగ 70, విల్‌ జాక్స్‌ (సి)మనోహర్‌ (బి)జీషన్‌ 22, సూర్యకుమార్‌ యాదవ్‌ (నాటౌట్‌) 40, తిలక్‌ వర్మ (నాటౌట్‌) 2, అదనం 1. (15.4ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 146పరుగులు.
వికెట్ల పతనం: 1/13, 2/77, 3/130
బౌలింగ్‌: కమిన్స్‌3-0-31-0, ఉనాద్కట్‌ 3-0-25-1, హర్షల్‌ పటేల్‌ 3-0-21-0, ఈషన్‌ మలింగ 3-0-33-1, జీషన్‌ అన్సన్‌ 3.4-0-36-1.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -