నవతెలంగాణ-హైదరాబాద్: కేరళకు గర్వకారణమైన విజింజం అంతర్జాతీయ ఓడరేవును మే 2న ప్రధానమంత్రి మోడీ జాతికి అంకితం చేయనున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ ఓడరేవును సందర్శించి, ఏర్పాట్లను సమీక్షించారు. అంతర్జాతీయ ఓడరేవులకు పోటీగా ఉండే కంట్రోల్ రూమ్ ను నిర్మించారు. క్రేన్ వ్యవస్థలతో సహా సౌకర్యాలు, నిర్వహణ పద్ధతుల వరకు అన్నింటిని కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ చేసేందుకు ఆధునిక అద్భుతమైన సౌకర్యాలతో నిర్మాణం చేశారని విజయన్ పేర్కొన్నారు. కంటైనర్ల కదలికను కొంతమంది మహిళలు నియంత్రించడం చూశానని పేర్కొన్నారు. ఏడుగురు విజింజం స్థానికులతో సహా 9 మంది మహిళలు ఓడరేవులోని ఆటోమేటెడ్ సిఆర్ఎంజి క్రేన్ల నిర్వహణను నియంత్రిస్తున్నారని అన్నారు. యార్డ్ క్రేన్లను మహిళలు నియంత్రించడం దేశంలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. విజింజం, కొట్టాపురం మరియు పూవార్‌కు చెందిన పి. ప్రిను, ఎస్. అనిషా, ఎల్. సునీతా రాజ్, డి.ఆర్. స్టెఫీ రబీరా, ఆర్.ఎన్. రజిత, పి. ఆశాలక్ష్మి, ఎ.వి. శ్రీదేవి, ఎల్. కార్తీక్ మరియు జె.డి. నాథనా మేరీ విజింజం పోర్టులో మహిళా క్రేన్ ఆపరేటర్లుగా ఉన్నారని వెల్లడించారు. వారిలో చాలా మంది మత్స్యకార కుటుంబాలకు చెందినవారని పేర్కొన్నారు. వారు అత్యాధునిక రిమోట్ డెస్క్ ద్వారా కంటైనర్ల కదలికను నియంత్రించడానికి నిపుణుల శిక్షణను పూర్తి చేసి దేశానికే గర్వకారణంగా మారారని కొనియాడారు. విజింజం పోర్టులోని మహిళా క్రేన్ ఆపరేటర్లు ఎల్డీఎఫ్ ప్రభుత్వ సంక్షేమ చర్యల నిరంతర మహిళా సాధికారతకు ప్రతిబింబమని విజయన్ పేర్కొన్నారు. టగ్‌పై సముద్ర ప్రయాణం ఒక ఆనందదాయకమైన అనుభవమన్నారు. గత 9 సంవత్సరాలలో మన దేశం సాధించిన విజయ శిఖరాలకు విజింజం ఓడరేవు ఒక ఉదాహరణ అని అన్నారు. ఈ ప్రాజెక్ట్ కేరళ ఆర్థిక రంగ అభివృద్ధికి, సామాజిక పురోగతికి గొప్ప శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు.
దేశంలో తొలిసారిగా యార్డ్ క్రేన్ల ఆపరేటర్లుగా మహిళలు
- Advertisement -
RELATED ARTICLES