Monday, May 19, 2025
Homeతాజా వార్తలునగరంలో విషాదం.. ఉరేసుకుని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

నగరంలో విషాదం.. ఉరేసుకుని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ :  ఓ విద్యార్థి పది పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదం ఘటన హైదారాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అల్వాల్, వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంజుల చిన్న కుమారుడు సంజయ్ కుమార్ (15) వర్గల్ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవలే పరీక్షలు కూడా రాశాడు. సెలవులకు తన తల్లి దగ్గరికి వచ్చిన సంజయ్ కుమార్ పరీక్ష ఫలితాలు మరో రెండు, మూడు రోజుల్లో వస్తాయని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. అనంతరం తాను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాననే భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్ రూంలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -