Wednesday, April 30, 2025
Homeసినిమానవ్వులే..నవ్వులు

నవ్వులే..నవ్వులు

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో హీరో ప్రియదర్శి చేసిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవీ మూవీస్‌ బ్యానర్‌ మీద శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిం చారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ, ‘ప్రియదర్శి వెర్సటైల్‌ హీరో అని నేను ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు ఆడియెన్స్‌ కూడా చెబుతున్నారు. శివలెంక కష్ణ ప్రసాద్‌తో ఇది నా మూడో సినిమా. హ్యాట్రిక్‌ హిట్‌ అయినందుకు ఆనందంగా ఉంది. సినిమా బాగుందని ఎంతో మంది ఫోన్‌లు, మెసెజ్‌లు చేస్తున్నారు. ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థ్యాంక్స్‌. మా సినిమాకు బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని తెలిపారు. ‘ఈ రోజు మా టీం గెలిచింది. గురువారం వైజాగ్‌లో ప్రీమియర్లు వేసినప్పుడు ఫుల్‌ పాజిటివ్‌ వైబ్స్‌ వచ్చాయి. సినిమా గెలిచింది.. మేం గెలిచాం’ అని ప్రియదర్శి చెప్పారు. నిర్మాత శివలెంక కష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ, ‘మా చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. దీని ప్రభంజనం ఇప్పుడే ప్రారంభం అయింది. మౌత్‌ టాక్‌తో ఈ చిత్రం మరింత ముందుకు వెళ్తుందని అంతా అంటున్నారు’ అని తెలిపారు. ‘చాలా రోజుల తరువాత హాల్‌ అంతా నవ్వడం చూశాను. థియేటర్లో ఆడియెన్స్‌ పగలబడి నవ్వుతున్నారు. నవ్వులతో థియేటర్‌ దద్దరిల్లిపోయింది’ అని తనికెళ్ల భరణి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img