సంతాన భాగ్యం
రాణి: నాకు 20సంవత్సరాల దాకా పిల్లలే పుట్టలేదు తెలుసా?
వేణి: అవునా.. మరి అప్పుడేం చేశావ్?
రాణి: ఏముంది… 21 వ యేడురాగానే మావాళ్ళు పెళ్ళి చేశారు. తర్వాతి సంవత్సరంలోనే మా చింటూ గాడు పుట్టేశాడు.
ఈ శుభవార్త కోసమే
భర్త మీద అలిగి ఇల్లు విడిచి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్యకి రోజూ ఫోన్ చేసి ”ఎలా ఉన్నావ్”? అని భర్త ఫోన్ చేస్తున్నాడు.
ఒక రోజు అతని అత్తగారు ఫోన్ తీసుకుని… ”మా అమ్మాయి నీ మీద కోపంతో ఉంది. ఇంక నీతో అస్సలు మాట్లాడదంట. ఎందుకలా రోజూ ఫోన్ చేస్తావ్?” అంది.
”ఈ మాట వినడం కోసమే రోజూ ఫోన్ చేస్తున్నా అత్తా” అన్నాడు అల్లుడు.
నిజం తెలుసుకుందామని…
నోకియా మొబైల్ ఉన్న రోజుల్లో చలపారు ఒక మొబైల్ షాప్‌కి వెళ్ళాడు
చలపారు : నోకియా మోబైల్ లో ఏదైనా పెద్ద స్క్రీన్ ఉన్నది చూపించు…
(షాప్ అతను ఒక మొబైల్ ఇచ్చాడు. మనోడు దాని ఆన్, ఆఫ్ చేసి చూసి మళ్ళీ ఆఫ్ చేసి అక్కడ పెట్టేశాడు.)
చలపారు : దీని కంటే పెద్దది చూపించు…
షాపతను : ఇంకాస్త పెద్దది చూపించాడు.
మనోడు మళ్లీ అలానే చేసి చూడాడు
షాపతనికి కోసం వచ్చి మీకు ఏం కావాలి అని గట్టిగా అడిగాడు
చలపారు : ఏం లేదు నోకియా మొబైల్ స్విచ్ ఆఫ్ ఆన్ చేసినపుడు, ఇద్దరు చేతులు కలుపుకుంటారు కదా…
వాళ్ళిద్దరూ ఎవరో పెద్ద స్క్రీన్‌లోనైతే కనిపిస్తుందేమోనని!+
పని – జీతం
రాజు : ఈ ఇంట్లో బట్టలుతకడం, అంట్లుతోమడం, వంటపని అంతా నేనే చేస్తాను.
సురేష్ : అలాగా, జీతం ఎంతిస్తారేమిటి?
రాజు : అయ్యో జీతం అడిగితే మా ఆవిడ ఇంట్లోంచి బయటకు తరిమేస్తుంది.
నవ్వుల్ పువ్వుల్
- Advertisement -
- Advertisement -