Tuesday, April 29, 2025
Homeమానవినిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ…

నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ…

సిమ్రాన్‌ బాలర్‌ జైన్‌… మహిళల ఆరోగ్యం, లైంగిక విద్యపై దృష్టి సారించారు. వీటిపై అవగాహన కల్పించేందుకే సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ఓ కంటెంట్‌ సృష్టికర్తగా, కష్టమైన సంభాషణలను ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకుపైగా అనుచరులను ప్రభావితం చేస్తున్నారు. తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. రుతుస్రావం, స్త్రీ లైంగికత గురించి మాట్లాడటమే నేరంగా భావిస్తున్న మన దేశంలో ఈ విషయాలను ఎంతో సరళమైన, నిష్కపటమైన విధానంతో నేరుగా సంబోధిస్తున్నారు. ఃనా కంటెంట్‌ అందం, ఫ్యాషన్‌, ప్రయాణం, మహిళల ఆరోగ్యం వంటి ప్రతిదాన్ని డాక్యుమెంట్‌ చేస్తుంది. ఇందులో లైంగిక విద్య కూడా ఉందిః అంటూ ఆమె ఇటీవల ఓ వెబ్‌సైట్‌తో పంచుకున్న విశేషాలు మానవి పాఠకుల కోసం….
బెంగళూరుకు చెందిన సిమ్రాన్‌ బాలర్‌ మహిళల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై ఎంత శ్రద్ధ చూపుతున్నారో ఆమె వీడియోలను చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. మెన్స్ట్రువల్‌ కప్పులపై ఆమె చేసిన వీడియో అత్యంత ప్రజాదరణ పొందింది. 25 లక్షల మందికి పైగా వీక్షణలను సంపాదించింది. ఃనేను దాన్ని స్నేహపూర్వకంగా, నా వ్యూవర్స్‌కు అవసరమైన విధంగా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాను. మెన్స్ట్రువల్‌ కప్‌ను ఎలా ఉపయోగించాలో చెప్పేందుకు స్వయంగా వాష్‌రూమ్‌కి వెళ్లి ఆ సమయంలో శ్వాస పద్ధతులు, లోపలికి ఎలా చొప్పించాలో చూపిస్తాను. కేవలం మాట్లాడే వీడియోను పెట్టడం కంటే ఇలా ప్రాక్టికల్‌గా చూపిస్తే మహిళలకు చాలా ఉపయోగంః అని ఆమె వివరించారు.
మొదట్లో భయపడి
కంటెంట్‌ సృష్టికర్తగా సిమ్రాన్‌ ప్రయాణం బెంగళూరులోని జైన్‌ విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ చదువుతున్నప్పుడు ప్రారంభమైంది. కళాశాలలో యూనిఫాం లేదా డ్రెస్‌ కోడ్‌ లేదు. ఇదే ఆమె విభిన్న శైలులతో ప్రయోగాలు చేయడానికి దారితీసింది. వాటిని ఆమె బ్లాగులో పెట్టేవారు. టిక్‌టాక్‌, రీల్స్‌ ప్రజాదరణ పొందిన తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు వెళ్లారు. కానీ ఆమె కంటెంట్‌ కోసం స్నేహితులతో, బాలికలతో చేసిన ప్రత్యేకమైన సంభాషణ నిర్ణయాత్మక మలుపు తిరిగింది. ఇది మహిళల పరిశుభ్రత, లైంగిక విద్యలో గణనీయమైన జ్ఞాన అంతరాలను బహిర్గతం చేసింది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటువంటి సున్నితమైన అంశాల గురించి ప్రస్తావించేందుకు మొదట్లో భయపడి ఆమె తన కంటెంట్‌ను టిక్‌టాక్‌కు తరలించారు. దేశంలో టిక్‌టాక్‌ నిషేధించే తన విద్యా వీడియోలను అప్‌లోడ్‌ చేసేవారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్‌స్టాగ్రామ్‌లోకి తిరిగి వచ్చారు. మొదట్లో అనేక సందేహాలు ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో వచ్చిన సానుకూల స్పందనలకు ఆశ్చర్యపోయారు.
గైనకాలజిస్ట్‌తో చర్చించి
ప్రతి నెలా సిమ్రాన్‌ తన ప్రేక్షకులతో ప్రశ్నోత్తరాల సెషన్‌లను నిర్వహిస్తారు. మహిళల ఆరోగ్యానికి సంబంధించి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాచారాన్ని సేకరిస్తారు. కంటెంట్‌ను సృష్టించడంలో ఆమెకు ఈ విధానం విస్తృతమైన పరిశోధనకు ఉపయోగపడుతుంది. వారి సమస్యలపై మేధోమథనం చేసి సమాచారాన్ని ధృవీకరించడానికి ఆమె వారంలో రెండు నుండి మూడు సార్లు తన గైనకాలజిస్ట్‌ను కలుస్తారు. ప్రతి సాంధి ఫౌండేషన్‌ ద్వారా లైంగిక విద్యావేత్తగా ఆమె సర్టిఫికేషన్‌ను కూడా అందుకున్నారు. ఃనన్ను ప్రజలు అడిగిన ప్రశ్నల గురించి నా గైనకాలజిస్ట్‌తో చర్చిస్తాను. మేము ఆ అంశాలనే లక్ష్యంగా చేసుకుంటాము. సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌లను చూస్తాను. కంటెంట్‌ను పోస్ట్‌ చేసే ముందు వైద్య నిపుణులతో ప్రతిదాన్ని క్రాస్‌-రిఫరెన్స్‌ చేస్తానుః అని ఆమె పంచుకున్నారు.
అపోహలను గుర్తించి
ఆమె వైద్య పరిభాషను సులభతరం చేస్తున్నారు. ప్రధానంగా కమ్యూనికేషన్‌ కోసం హిందీని ఒక భాషగా ఉపయోగిస్తున్నారు. విపరీతమైన అధ్యయనం తర్వాత ఆమె పతిరోజూ ఐదు నుండి ఆరు ఇన్‌స్టాగ్రామ్‌ కథనాలను పోస్ట్‌ చేస్తున్నారు. ప్రతి వారం రెండు నుండి మూడు అంశాలపై దృష్టి సారించి, స్థిరమైన పోస్టింగ్‌ షెడ్యూల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ విధానం ఎనిమిదేండ్లుగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆమె ప్రేక్షకులను పెంచుకోవడంలో కీలకంగా మారింది. ఆమె కంటెంట్‌ మహిళల ఆరోగ్య సమస్యలను విస్తృత కవర్‌ చేస్తుంది. రుతుక్రమ ఉత్పత్తులు, రొమ్ము స్వీయ పరీక్షల నుండి స్త్రీ ఉద్వేగం వరకు లైంగిక ఆరోగ్యంలో అతిపెద్ద అపోహలుగా గుర్తించిన వాటిని పరిష్కరిస్తున్నారు.
వైరల్‌ ప్రపంచంలో ప్రామాణికంగా
కొన్ని రకాల ట్రోల్స్‌ ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో మహిళా అనుచరులు ఉండటం పట్ల సిమ్రాన్‌ సంతోషంగా ఉన్నారు. ఃనేను వారితో డీఎంలలో కమ్యూనికేట్‌ చేస్తూనే ఉంటాను. వారి వ్యాఖ్యలకు ప్రత్యుత్తరం ఇస్తాను. నా ప్రశ్నలకు వారు చక్కగా స్పందిస్తున్నారు. ప్రేక్షకులతో నాకు చాలా వ్యక్తిగత సంబంధం ఉంది. నా కంటెంట్‌ నా ప్రేక్షకులు మెరుగైన వ్యక్తులుగా మారడానికి, మెరుగైన ప్రయా ణ ఎంపికలు చేసుకోవడానికి, వారి భాగస్వాములతో మెరుగ్గా కమ్యూనికేట్‌ చేయడానికి సహాయపడుతుందని నేను అనుకుంటున్నానుః అని ఆమె పంచుకున్నారు.
విశ్వసించే వారితోనే…
ఃనా దృష్టికి ప్రతిధ్వనించే బ్రాండ్‌లతో, నా కంటెంట్‌లో వారి ఉత్పత్తులను సేంద్రీయంగా ఏకీకృతం చేయడానికి నన్ను విశ్వసించే వారితో మాత్రమే నేను కనెక్ట్‌ అవుతాను. వారు ఏ ఉత్పత్తిని ప్రమోట్‌ చేయాలో నాకు చెబుతారు. కానీ నేను కథాంశాన్ని, వీడియోను ఎలా చేయాలో నిర్ణయిస్తానుః అని ఆమె వివరించారు. ప్రస్తుతం సిమ్రాన్‌ యూట్యూబ్‌తో సహా కొత్త ప్లాట్‌ఫారమ్‌లను అన్వేషించాలని యోచిస్తున్నారు. ఇక్కడ ఆమెకు ఇప్పటికే 5,00,000 మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. భవిష్యత్‌లో స్నాప్‌చాట్‌ని ఉపయోగించడం పట్ల ఆమె ఉత్సాహంగా ఉన్నారు. ఆమె పరిశుభ్రత, వెల్నెస్‌ ఉత్పత్తులను అందించే బ్రాండ్‌ అన్‌బౌండ్‌ సృష్టికర్త అలాగే సహ వ్యవస్థాపకురాలు కూడా. ఃఏ వీడియో వైరల్‌ అవుతుందో, ఏది కాదో అది మన చేతుల్లో లేదని నేను అర్థం చేసుకున్నాను. అక్కడ చాలా పోటీ ఉంది. కొత్తగా యూట్యూబర్‌ కావాలంటే మీరు ముందుకు సాగాలి, స్థిరంగా ఉండాలిః అంటూ ఆమె తన మాటలు ముగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img