– బతుకమ్మ కుంటలోనే ఈసారి బతుకమ్మలు
– అభివృద్ధి పనులను ప్రారంభించిన హైడ్రా కమిషనర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన కొత్త లోగోను విడుదల చేసింది. నీటి బొట్టుతో సరికొత్తగా లోగోను బుధవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఈవీడీఎం లోగోనే హైడ్రా వినియోగిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు కొత్తగా జలవనరుల శాఖను పోలి ఉండేలా హైడ్రా లోగోను రూపొందించారు. హెచ్ అక్షరంపై నీటి బొట్టుతో లోగోను రూపకల్పన చేశారు. హైడ్రా కార్యాలయం, వాహనాలు, సిబ్బంది యూనిఫాంపై కూడా కొత్త లోగో వేస్తారు. అలాగే, హైడ్రా అధికారిక ఎక్స్(ట్విట్టర్) అకౌంట్‌కు కొత్త లోగోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టారు.
బతుకమ్మ కుంటలో అభివృద్ధి పనులు
బతుకమ్మ ఉత్సవాల నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ కుంటకు సంబంధించిన కోర్టు వివాదం మంగళవారం పరిష్కారమైందన్నారు. హైడ్రా కమిషనర్ బుధవారం అంబర్‌పేట బతుకమ్మ కుంటను సందర్శించారు. స్థానికుల సమక్షంలో అక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. చెరువును పునరుద్ధరిస్తే పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారుతాయన్నారు. పనులకు సహకరించాలని స్థానికులను కోరారు. అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని స్థానికులు కమిషనర్‌కు హామీ ఇచ్చారు.
నీటిబొట్టుతో సరికొత్తగా హైడ్రా లోగో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES