Wednesday, April 30, 2025
Homeజాతీయంనూత‌న న్యాయ కమిషన్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి

నూత‌న న్యాయ కమిషన్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నూత‌న న్యాయ కమిషన్‌ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి నియమితులయ్యారు. కొత్త కమిషన్‌ నియామకానికి ప్రధాని మోడీ ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గతేడాది సెప్టెంబరు 3న 23వ లా కమిషన్‌ మూడేళ్ల కాలపరిమితితో ఏర్పడగా.. తాజాగా ఈ కమిషన్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, కమిషన్‌ పూర్తిస్థాయి సభ్యులుగా హితేశ్‌ జైన్‌ (న్యాయవాది), ప్రొఫెసర్‌ డి.పి.వర్మ (లా ప్రొఫెసర్‌- బీహెచ్‌యూ) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కమిషన్‌ పదవీ కాలం 2027 ఆగస్టు 31వరకు కొనసాగనుంది. లా కమిషన్‌ ఛైర్మన్‌గా నియమితులైన జస్టిస్‌ మహేశ్వరి 2023 మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. 2004 సెప్టెంబరు నెలలో రాజస్థాన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన జులై 2014లో అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అనంతరం ఫిబ్రవరి 2016లో మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అక్కడ నుంచి 2018 ఫిబ్రవరి నెలలో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. జనవరి 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img