- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కొనసాగుతోంది. మూడో రోజు టూర్‌లో భాగంగా ఇవాళ భారత రాయబార కార్యాలయంలో సీఎం రేవంత్ పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. కాగా ఈ సమావేశంలో ప్రముఖ సంస్థలైన టయోటా, తోషిబా, ఏసిస్, ఎన్టీటీ కంపెనీల సీఈఓవోలు కూడా ఉండనున్నారు. ఆ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి టోక్యోలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.