Saturday, May 3, 2025
Homeజాతీయంనేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌కి ఢిల్లీ కోర్టు నోటీసులు

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌కి ఢిల్లీ కోర్టు నోటీసులు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నేషనల్‌ హెరాల్డ్‌ మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలు సోనియా, రాహుల్‌గాంధీలకు ఢిల్లీ కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఏ దశలోనైనా వాదనలు వినిపించుకునే అవకాశం ఉందని.. తమ తరపు వాదించుకునే ఆ న్యాయమైన హక్కు విచారణకు ప్రాణం పోస్తుందని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్‌ గోగే అన్నారు. ఈ కేసును మే 8కి వాయిదావేశారు. ఇక ఈ కేసులో ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) ఇటీవలే ఛార్జిషీటును దాఖలు చేసింది. జూన్‌ 26, 2014న బిజెపినేత సుబ్రమణియన్‌ స్వామి దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును మెజిస్ట్రేట్‌ కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత 2021లో దర్యాప్తు ప్రారంభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img