నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్‌లో గూఢచార్యానికి పాల్పడుతున్న ఓ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాలక్ షేర్ మాసిహ్, సూరజ్ మసిహ్ అనే ఇద్దరు యువకులు వద్ద నుంచి ఎయిర్ బేస్ కు సంబంధించిన పలు కీలక ఫోటోలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పాలక్ షేర్ మాసిహ్, సూరజ్ మసిహ్ అనే ఇద్దరు యువకులు పాక్ చెందిన నిఘా వ్యవస్థతో సంబంధాలున్నాయని, రహస్యంగా భారత్ కు చెందిన ఆర్మీ సమాచారాన్ని అందజేస్తున్నారని అధికారులు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు సమాచారం ప్రకారం హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు అలియాస్ హ్యాపీ సూచనల మేరకు వీరు పని చేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం హర్‌ప్రీత్ సింగ్ అమృత్‌సర్ జైల్లో ఉన్నాడు. సదరు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
పంజాబ్‌లో ఇద్దరు గూఢచారులు అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES