Wednesday, April 30, 2025
Homeసినిమాపల్లెటూరి అమ్మాయిగా…

పల్లెటూరి అమ్మాయిగా…

సంపూర్ణేష్‌ బాబు, సంజోష్‌లు హీరోలుగా నటించిన చిత్రం ‘సోదరా’. అన్న దమ్ముల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి మన్‌ మోహన్‌ మేనం పల్లి దర్శకుడు.
క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆరతి గుప్తా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా మంగళవారం ఆరతి గుప్తా మీడియాతో ముచ్చటించారు.. ఆ విశేషాలు..
చండీగీడ్‌లో పుట్టి పెరిగిన నేను ముంబరులో స్థిరపడ్డాను. ఇంతకు ముందు బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించాను. కానీ తెలుగులో ఇది నా తొలి చిత్రమిది. ఈ కథ నాకెంతో నచ్చింది. లైట్‌ హార్టెడ్‌ ఫ్యామిలీ డ్రామా ఇది. మీ స్నేహితులు, ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ ఎవరితోనైనా దీన్ని చూడొచ్చు.
ఇందులో నేను అమాయకమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. సింపుల్‌ విలేజ్‌ గర్ల్‌. చదువున్న అమ్మాయి. ఇన్నోసెంట్‌, అండ్‌ డిగ్నిఫైడ్‌. ఇంతకు ముందు ట్రెడిషినల్‌ పాత్రలు చేశాను. రియల్‌లైఫ్‌లో కూడా నేను సింపుల్‌ గర్ల్‌. నా వ్యక్తిత్వం అలానే ఉంటుంది. నా వ్యక్తిత్వానికి దగ్గర ఉండే పాత్రను ఈ సినిమాలో చేశాను.
సంపూ, సంజోష్‌లతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో కో ఆపరేటివ్‌. ఇద్దరూ సెట్‌లో ఉంటే ఎంతో ఎనర్జీ ఉంటుంది. దర్శకుడు మోహన్‌కి చాలా క్లారిటీ ఉంది. పర్‌ఫార్మ్‌ చేయడానికి స్కోప్‌ ఉన్న పాత్రను ఇచ్చారు. ఆయన వల్లే నేను బాగా నటించగలిగాను.
అన్ని తరహా పాత్రలు, అన్నీ తరహా సినిమాలు చేయాలని ఉంది. అవసరమైతే ఎలాంటి పాత్రనైనా చేస్తాను. ముఖ్యంగా పర్‌ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రలు చేయాలని ఉంది. బాగా యాక్ట్‌ చేయగలిగితే మనం అందంగా కనిపిస్తాం. ఒకవేళ అందంగా ఉండి యాక్ట్‌ చేయలేకపోయినా గ్లామర్‌గా కనిపించం. అందుకే నటనకి స్కోప్‌ ఉన్న పాత్రల్నే అంగీకరిస్తా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img