Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంప‌శ్చిమ‌ బెంగాల్‌లో బాంబు పేలుళ్లు..యువ‌తి మృతి

ప‌శ్చిమ‌ బెంగాల్‌లో బాంబు పేలుళ్లు..యువ‌తి మృతి

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌శ్చిమ‌ బెంగాల్ లో బాంబు పేలుడు క‌ల‌క‌లం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ యువ‌తి మృతి చెందింది. నాడియా జిల్లా కలిగంజ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బరోచంద్గర్ గ్రామంలో నాటు బాంబు పేలింది. 13 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సంఘటనపై స్పందించారు. బరోచంద్గర్‌లో జరిగిన పేలుడులో ఒక యువతి మరణించడం పట్ల దిగ్భ్రాంతి చెందినట్లు పేర్కొన్నారు. నిందితుల అరెస్ట్‌ కోసం పోలీసులు చట్టపరమైన చర్యలు చేపడతారని అన్నారు.కలిగంజ్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఎంసీ అభ్యర్థి అలీఫా అహ్మద్, ప్రత్యర్థి బీజేపీకి చెందిన ఆశిష్ ఘోష్‌పై 50,049 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad