Tuesday, April 29, 2025
Homeజాతీయంప‌హ‌ల్గాంలో కేంద్ర హోంమంత్రి వీహంగ వీక్ష‌ణం

ప‌హ‌ల్గాంలో కేంద్ర హోంమంత్రి వీహంగ వీక్ష‌ణం

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: ప‌ర్యాట‌కుల‌పై ఉగ్ర‌దాడి జ‌రిగిన జ‌మ్మూక‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గాం ప్రాంతాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హెలికాప్ట‌ర్ ద్వారా వీహంగ వీక్ష‌ణం చేశారు. దాడి జ‌రిగిన ప్రాంతాల్లో క‌లియ తిరుగుతూ..సంఘ‌ట‌న ప‌రిస‌రాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. అంత‌కు ముందుకు శ్రీ‌న‌గ‌ర్ లోని పోలీస్ కంట్రోమ్ రూం వ‌ద్ద‌ ఉగ్ర‌దాడిలో మ‌ర‌ణించిన వ్య‌క్తుల మృత‌దేహాల‌కు ఆయ‌న నివాళ్లుర్పించారు. వారి శ‌వ‌పేటీక‌ల‌పై పుష్ప‌గుచ్చం ఉంచి శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించారు. ఆ త‌ర్వాత బాధితుల కుటుంబ‌స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని తెలియ‌జేశారు. ఆ మృత‌దేహాల‌ను ప్ర‌త్యేక వాహ‌నాల్లో వారి స్వ‌స్థ‌లాలకు త‌ర‌లించారు అధికారులు. ప‌లువురు బాధితుల‌ను క‌లిసి కేంద్ర హోంమంత్రి ప‌రామ‌ర్శించారు. అంత‌కుముందు మంగళవారం రాత్రే శ్రీనగర్‌కు చేరుకున్న హోం మంత్రి అమిత్‌ షా వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ ఉదయం మృతదేహాలకు ఆయన నివాళి అర్పించిన అనంతరం.. ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మరోవైపు.. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్‌లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. మ‌రోవైపు ప‌ర్యాట‌కుల‌పై ఉగ్ర‌దాడిని నిర‌సిస్తూ దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు మిన్నంటాయి. జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడిని వ్య‌తిరేకంగా ప‌లు సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. పాకిస్థాన్ దేశానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. బీహార్లోని పాట్నాలో కూడా భారీ తీశారు. పాకిస్థాన్ దేశానికి త‌గిన బుద్ది చెప్పాల‌ని ఆందోళ‌న‌కారులు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img