Wednesday, April 30, 2025
Homeజాతీయంపహల్గాంలో విశాఖ వాసిని వెంటాడి కాల్చి చంపిన ఉగ్రమూకలు

పహల్గాంలో విశాఖ వాసిని వెంటాడి కాల్చి చంపిన ఉగ్రమూకలు

నవతెలంగాణ – హైదరాబాద్: జ‌మ్మూక‌శ్మీర్‌లోని పహల్గాంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఉగ్ర‌దాడిలో విశాఖ‌ప‌ట్నం వాసి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్ర‌మౌళి మృతిచెందారు. పారిపోతున్న ఆయ‌న్ను వెంబడించి మరీ కాల్చి చంపినట్లు స‌మాచారం. చంపొద్ద‌ని వేడుకున్నా ఉగ్ర‌మూక‌లు ఈ ఘాతుకానికి పాల్ప‌డినట్లు తెలుస్తోంది. చంద్ర‌మౌళి మృతదేహాన్ని స‌హ‌చ‌ర టూరిస్ట్‌లు గుర్తించారు. స‌మాచారం తెలిసిన వెంట‌నే విశాఖ నుంచి కుటుంబస‌భ్యులు పహల్గాంకు బయలుదేరి వెళ్లారు. కాగా, ఈ ఘటనలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా… మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స‌మాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img