నవతెలంగాణ-హైదరాబాద్: కశ‌్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు తీవ్రంగా ఖండించారు. పహల్గాం ఉగ్రదాడి తమను తీవ్రంగా బాధించిందని భారత్ హోడ్ కోచ్ గౌతమ్ గౌంభీర్ అన్నారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు తగిన మూల్యం చెల్లించుకుంటారని, ఆ దిశగా ఇండియా తిప్పికొడుతుందని, ఇండియాలో హింసకు తావులేదని, మృతుల కుటుంబాలకు ఆ దేవుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థిస్తున్నానని గౌంభీర్ పేర్కొన్నారు. పర్యాటకులపై ఉగ్రదాడి వార్త తనను కలిచివేసిందని, బాధితుల కుటుంసభ్యులకు ఆ దేవుడు మనోధైర్యం కల్పించాలని,ఈ తరహ దాడులకు తిప్పికొట్టడానికి ఆశతో, మానవత్వంతో ఐక్యంగా నిలబడదామని యువరాజ్ సింగ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సంతాపం తెలియాజేశారు. ప్రతి దాడిలో అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోతున్నారు, పహల్గాం ఉగ్రదాడి వార్త వినగానే గుండె ఆగే పనైందని, కొన్ని రోజుల క్రితం అక్కడే గడిపి వచ్చామని ఇర్పాన్ పఠాన్ చెప్పారు. ఇదో భయాంనక ఉగ్రదాడి, దాడిలో మృతిచెందిన అమాయక పర్యాటకుల ప్రాణాలను బలిగొనడం ఖండించదగ విషయం, వారి కుటుంబసభ్యులకు దేవుడు మనోధైర్యం కల్పించాలని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానూభూతిని వీరేంద్ర సెహ్వగ్ తెలియజేశారు.
పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన క్రికెటర్లు
- Advertisement -
- Advertisement -