Tuesday, May 20, 2025
Homeజాతీయంప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిని వ్య‌తిరేకిస్తూ బీహార్‌లో నిర‌స‌న‌లు

ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిని వ్య‌తిరేకిస్తూ బీహార్‌లో నిర‌స‌న‌లు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: క‌శ‌్మీర్‌లోని ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిని వ్య‌తిరేకిస్తూ బీహార్ రాజ‌ధాని పాట్నాలో నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ప్ల‌కార్డులు చేత‌బూని ర్యాలీ చేప‌ట్టారు. పాకిస్థాన్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ దాడికి పాల్ప‌డిన ఉగ్ర‌సంస్థ‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆందోళ‌నకారులు డిమాండ్ చేశారు. ఉత్త‌ర క‌శ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లాలో మంగ‌ళ‌వారం సాయంత్రం ప‌ర్యాట‌కుల‌పై ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డిన విష‌యం తెలిసిందే. ఈ దాడిలో ప‌లువురు అమాయ‌క టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సంఘ‌ట‌న స్థలానికి చేరుకొని..గాయ‌ప‌డిని వారిని స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దాడుల‌కు తెగ‌బ‌డిన ఉగ్ర‌వాదుల కోసం వెంట‌నే సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. అద‌న‌పు బ‌ల‌గాల‌ను ర‌ప్పించి ప‌హ‌ల్గాంలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తాను క‌ల్పించారు. ఆయా మార్గాల్లో చెక్ పోస్టుల‌ను ఏర్పాటు చేసి ప్ర‌తి వాహ‌నాన్ని క్షుణ్ణం త‌నిఖీ చేస్తున్నారు. మ‌రోవైపు ఉగ్ర‌దాడిని నిర‌సిస్తూ బుధ‌వారం క‌శ్మీర్ లో బంద్ ప్ర‌క‌టించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -