పహల్గాం మృతులకు కేంద్ర హోంమంత్రి నివాళి..
నవతెలంగాణ-హైదరాబాద్: కశ‌్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మృతదేహాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాలు అర్పించారు. శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూం వద్ద వారి శవపేటికలపై పుచ్చగచ్ఛం ఉంచి ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ దాడితో కశ్మీర్ తోపాటు దేశమంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీకల్ 370 రద్దు తర్వాత అతిపెద్ద ఉగ్రదాడి ఇదేనని ఆయన తెలిపారు. అంతకుముందు మంగళవారం రాత్రే శ్రీనగర్‌కు చేరుకున్న హోం మంత్రి అమిత్ షా వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ ఉదయం మృతదేహాలకు ఆయన నివాళి అర్పించిన అనంతరం.. ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మరోవైపు.. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్‌లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.