నవతెలంగాణ-హైదరాబాద్: కశ్మీర్ పహల్గాంలోని పర్యటకులపై భీకర ఉగ్రదాడి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఘటనలో బాధిత కుటుంబాలకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇస్తామని తెలిపింది. మరోవైపు.. మంగళవారం ఉగ్రదాడి జరిగిన ప్రదేశానికి కేంద్రహోం మంత్రి అమిత్‌షా చేరుకున్నారు. కాల్పులు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలొగ్గదని కేంద్రమంత్రి పునరుద్ఘాటించారు. అంతకుముందు శ్రీనగర్‌లో మృతులకు నివాళులు అర్పించారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు.
‘పహల్గాం’ మృతుల కుటుంబాలకు పరిహారం
- Advertisement -
RELATED ARTICLES