- Advertisement -
నవతెలంగాణ – ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో భారత్ నుంచి పాకిస్థాన్‌కు చుక్క నీరు కూడా వెళ్లనీయమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు. ఉగ్రదాడితో నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పాటిల్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ పలు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వాటిని సమర్థవంతంగా అమలు చేస్తామని వెల్లడించారు.
- Advertisement -