నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్ సమాచార మంత్రి అతుల్లా తరార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ పై భారతదేశం యుద్ధం చేయబోతుందన్నారు. “రాబోయే 24 నుండి 36 గంటల్లో భారతదేశం పాకిస్థాన్‌పై సైనిక దాడికి ప్రణాళికలు వేస్తున్నట్లు మాకు విశ్వసనీయ నిఘా ఆధారిత సమాచారం ఉంది. భారతదేశం తీసుకునే ఏ చర్యకైనా పూర్తి శక్తితో ఇస్లామాబాద్ ప్రతిస్పందిస్తుంది. పాక్ తన భూభాగాన్ని అన్ని విధాలుగా రక్షించుకుంటుంది. దేశం తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను అవసరమైన అన్ని విధాలుగా కాపాడుకుంటుంది. భారత్ పాక్ పై యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తే, వినాశకరమైన నష్టాలకు ఆ దేశమే పూర్తిగా బాధ్యత వహిస్తుంది” అని ఆయన అన్నారు. పాక్ పై భారత్ చేస్తున్న ప్రణాళికబద్ధమైన దురాక్రమణను అంతర్జాతీయ సమాజం గమనించాలని తరార్ పిలుపునిచ్చారు. మరోవైపు, భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. పహల్గాం దాడి తర్వాత ఈ భేటీ జరగడంతో సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
పాకిస్థాన్ సమాచార మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Advertisement -
RELATED ARTICLES