నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం భారత విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ పౌరులకు తక్షణమే వీసా సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఓ ప్రకటనల విడుదల చేసింది. ఆదేశ పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసా పర్మిట్‌లను వెంటనే ఉపసహరించుకున్నట్లు భారత్ ప్రభుత్వం పేర్కొంది. ఈనెల 27లోపు భారత్‌లో ఉన్న పాక్ దేశస్తులు తమ దేశం విడిచి వెళ్లాలని, అదే విధంగా మెడికల్ వీసాపై ఇండియాకు వచ్చిన ఆ దేశస్తులు ఏప్రిల్ 29లోపు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గడువులోపు పాకిస్థాన్ పౌరులు వెళ్లిపోవాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు పాక్‌లో ఉన్న భారతీయులు వెంటనే ఇండియాకు రావాలని సూచించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. పాక్ దౌత్యసంబంధ అంశాలపై కెబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్-ఇండియా సరిహద్దులను మూసివేయడంతో పాటు సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
పాక్ దేశస్తులకు వీసా సర్వీసులు రద్దు
- Advertisement -
RELATED ARTICLES