నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శనివారం ప్రకటించారు. అయితే పాక్ ప్రధాని వ్యాఖ్యలను జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తోసిపుచ్చారు. ఆయన ప్రకటనకు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఒమర్ వ్యాఖ్యానించారు. శనివారం ఒమర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ మొదట ఈ సంఘటనను ఖండించి, ఆపై భారతదేశంపై నింద మోపింది. ఈ దాడి దురదృష్టకరం అని.. ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగకూడదని నొక్కి చెప్పింది’ అని ఆయన విమర్శించారు. మొదట పహల్గామ్‌లో ఏం జరిగిందనేది వారు గుర్తించలేదు. దీని వెనుక భారతదేశం ఉందనే వారు ఆరోపించారు. మొదట మాపై ఆరోపణలు చేసిన వారికి ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయడం ఏమంత కష్టం. అందుకే నేను వారి ప్రకటనలకు ప్రాముఖ్యత ఇవ్వాలనుకోవడం లేదు. ఏదైనా సరే ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.
పాక్ ప్రధాని వ్యాఖ్యలను తోసిపుచ్చిన ఒమర్ అబ్దుల్లా
- Advertisement -
RELATED ARTICLES